న్యూఢిల్లీ: యూఎస్–-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సడలడంతో బంగారానికి ఆకర్షణ తగ్గింది. మంగళవారం ధరలు భారీగా పడిపోయాయి. జాతీయ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 4,100 తగ్గి రూ. 1,21,800 కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. ఔన్స్ధర 4,000 డాలర్ల కంటే కిందకు జారి, 3,887.03 డాలర్ల వద్ద ట్రేడయింది. అంతకుముందు సెషన్‌లో ఇది 3.21 శాతం పడిపోయింది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా రూ. 4,100 తగ్గి రూ. 1,21,200 కు చేరుకుంది. వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 6,250 తగ్గి రూ. 1,45,000 కు చేరుకుంది.
