- మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచాలని రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీ) ప్లాన్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం, 2026లో ఈ కంపెనీలు 4జీ, 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలను 16–20శాతం పెంచే అవకాశం ఉంది.
తక్కువ ధర ప్లాన్‌లను తొలగించడం, ఓటీటీ ప్రయోజనాలను కేవలం ప్రీమియం ప్యాక్‌లకే పరిమితం చేయడం ద్వారా వినియోగదారులను అధిక ధరలకు ఈ కంపెనీలు అలవాటు చేస్తున్నాయి. ధరలు పెరిగితే గత ఎనిమిదేళ్లలో నాలుగో ప్రధాన టారిఫ్ హైక్ అవుతుంది.
గతంలో 2019, 2021, 2024 లలో రీచార్జ్ ప్లాన్ రేట్లు పెరిగాయి. ఈ పెంపు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులందరినీ ప్రభావితం చేస్తుందని రిపోర్ట్ తెలిపింది.
