యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ..82 మంది ఉద్యోగులకు షోకాజ్‌‌ నోటీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ  హాస్పిటల్‌‌లో  ..82 మంది ఉద్యోగులకు షోకాజ్‌‌ నోటీసులు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా హాస్పిటల్‌‌లో విధులకు హాజరు కాని 82 మంది ఉద్యోగులకు ఒకేసారి షోకాజ్‌‌ నోటీసులు జారీ అయ్యాయి. యాదాద్రి కలెక్టర్‌‌ హనుమంతరావు గురువారం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటల పాటు హాస్పిటల్‌‌లోనే తిరుగుతూ... సమయపాలన పాటించని 63 మంది, ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్యూటీకి హాజరుకాని 19 మంది ఉద్యోగులకు షోకాజ్‌‌ నోటీసులు జారీ చేశారు

. అనంతరం హాస్పిటల్ పరిసరాలను పరిశీలించి, వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండడంతో కాంట్రాక్టర్‌‌పై, శానిటేషన్‌‌ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న ట్రీట్‌‌మెంట్‌‌, ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.