యాప్లు, మ్యాపులతో రైతుల ఉసురు పోసుకుంటున్నరు : ఎమ్మెల్యే హరీశ్రావు

యాప్లు, మ్యాపులతో  రైతుల ఉసురు పోసుకుంటున్నరు : ఎమ్మెల్యే హరీశ్రావు
  • ప్రభుత్వంపై బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే హరీశ్​రావు​ ధ్వజం

మెదక్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిసాన్ కపస్ యాప్ తెచ్చి పత్తి రైతులను ముంచగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం యాప్​లు, మ్యాపులతో రైతుల ఉసురు పోసుకుంటున్నదని సిద్దిపేట బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన మెదక్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. వ్యవసాయానికి నీళ్లు, కరెంటు, ఎరువులు ఇవ్వడం చేతగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాప్‌‌‌‌‌‌‌‌లు, మ్యాప్‌‌‌‌‌‌‌‌ల పేరుతో దొంగ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. 

అక్షరాస్యత లేని రైతులు, స్మార్ట్​  ఫోన్ లు లేని మహిళా రైతులు అధికారుల చుట్టూ తిరగాలా? నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ లేని గ్రామాల్లో, తండాల్లో  రైతులు ఈ యాప్‌‌‌‌‌‌‌‌లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఇది కేవలం ఎరువుల సరఫరాను తగ్గించి రైతులను వేధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకమని ధ్వజమెత్తారు. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా దుకాణాల ద్వారా రైతులకు అవసరమైన  యూరియా ఎరువు బస్తాలు అందించాలన్నారు.

 ఈ యాసంగి సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సాయం ఊసే లేదన్నారు.  సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తరా? చేయరా? అనేది ప్రభుత్వం తెలపక పోవడంతో మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు పరిధిలోని నాలుగు మండలాల రైతులు యాసంగి పంట సాగు విషయంలో సందిగ్ధంలో ఉన్నారని హరీశ్​రావ్​ అన్నారు. ఆయకట్టులో యాసంగి పంటల సాగుకు నీటి విడుదలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.  

కేటీఆర్​కు నాకు మధ్య మిత్రభేదం సృష్టించే కుట్ర

పంచాయతీ ఫలితాలతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్​కు చేరిందని హరీశ్ రావు అన్నారు. త్వరలో కుర్చీ పోతుందనే భయంతో అడ్డగోలుగా వాగుతున్నారని మండిపడ్డారు. తనకు, కేటీఆర్​కు మధ్య మిత్ర భేదాలు సృష్టించి బీఆర్ఎస్​ను బలహీనపరచాలని చీప్​ట్రిక్ ప్లే చేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు ఎవరూ పడిపోరని, కుట్రలు, కుతంత్రాలు ఫలించబోవని అన్నారు. ‘‘ఒక్కటి గుర్తుంచుకో రేవంత్.. నా గుండెల్లో ఎప్పటికైనా ఉండేది కేసీఆరే. 

నా చేతిలో ఎగిరేది గులాబీ జెండానే. నీ దాష్టీకాలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా నేను, కేటీఆర్ మరింత సమన్వయంతో, మరింత సమర్థంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతం. తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న నిన్ను, కాంగ్రెస్ ను గద్దె దించుతం’’ అని ఆయన విమర్శించారు.