SBI లో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్షా లేదు.. అప్లయ్ చేసుకోండిలా

SBI  లో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్షా లేదు.. అప్లయ్ చేసుకోండిలా

నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంకింగ్​ ఉద్యోగాల్లో పొందాలనుకునేవారి మరీ గుడ్​ న్యూస్.. బ్యాంకు జాబ్​ లకోసం ఎదురు చూస్తున్న వారికి SBI తీయ్యని వార్త చెప్పింది. స్పెషల్​ క్యాడర్​ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం103 స్పెషల్​ క్యాడర్​ ఆఫీసర్లు(SCO) పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు SBI అధికారిక వెబ్​ సైట్​sbi.bank.in లోకి వెళ్లి ఆన్​ లైన్​ లో అప్లయ్​ చేసుకోవాలి. అప్లయ్​ చేసుకునేందుకు చివరి తేది నవంబర్​ 17, 2025.

పోస్టుల వివరాలు.. 

ప్రాడక్ట్​, ఇన్వెస్టిమెంట్​, రీసెర్చ్​ హెడ్​: 1 పోస్టు
జోనల్​ హెడ్​: 4
రీజినల్​ హెడ్​: 4
రిలేషన్​ షిప్​ మేనేజర్​ టీం హెడ్​: 19
ఇన్వెస్ట్​ మెంట్​ స్పెషలిస్ట్​: 22
ఇన్వెస్ట్​ మెంట్​ ఆఫీసర్: 46
ప్రాజెక్టు డెవలప్​ మెంట్​ మేనేజర్​ (బిజినెస్​) : 2
సెంట్రల్​ రీసెర్చ్​ టీ మ్​ (సపోర్ట్) : 2

విద్యార్హతలు.. 

ప్రాడక్ట్​, ఇన్వెస్టిమెంట్​, రీసెర్చ్​ హెడ్: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్.  ప్రాధాన్యత గల అర్హతలలో CA, CFP, CFA, NISM ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, NISM 21-A, లేదా రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేట్ 

జోనల్ హెడ్ (రిటైల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచ గ్రాడ్యుయేషన్.
రీజినల్ హెడ్: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.
రిలేషన్షిప్ మేనేజర్-టీమ్ లీడ్: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.
ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ (IS): గుర్తింపు పొందిన సంస్థ లేదా CA/CFA నుండి ఫైనాన్స్, అకౌంటెన్సీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఎకనామిక్స్, క్యాపిటల్ మార్కెట్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లేదా యాక్చురియల్ సైన్స్‌లో పిజి డిగ్రీ లేదా పిజి డిప్లొమాలో ప్రొఫెషనల్ అర్హత.
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (IO): గుర్తింపు పొందిన సంస్థ లేదా CA/CFA నుండి ఫైనాన్స్, అకౌంటెన్సీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఎకనామిక్స్, క్యాపిటల్ మార్కెట్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లేదా యాక్చురియల్ సైన్స్‌లో పిజి డిగ్రీ లేదా పిజి డిప్లొమాలో ప్రొఫెషనల్ అర్హత.

►ALSO READ | Grokipedia:ఎలాన్ మస్క్ AI ఎన్ సైక్లోపిడియా.. వికీపిడియాకు పోటీగా గ్రోకీపిడియా.. ప్రారంభమైన కొద్దిసేపటికే వెబ్ సైట్ క్రాష్

ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్): ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA/PGDM.
సెంట్రల్ రీసెర్చ్ టీం (సపోర్ట్): ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వాణిజ్యం, ఆర్థికం, ఆర్థిక శాస్త్రం, నిర్వహణ, గణితం లేదా గణాంకాలలో గ్రాడ్యుయేషన్.

వయోపరిమితి: (Age limits): 

ప్రాడక్ట్​, ఇన్వెస్టిమెంట్​, రీసెర్చ్​ హెడ్:35 – 50 సంవత్సరాలు
జోనల్ హెడ్ (రిటైల్): 35 – 50 సంవత్సరాలు
రిజినల్​ హెడ్​: 35– 50 సంవత్సరాలు
రిలేషన్షిప్ మేనేజర్-టీమ్ లీడ్: 28 – 42 సంవత్సరాలు
ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ (IS): 28 – 42 సంవత్సరాలు
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (IO): 28 – 40 సంవత్సరాలు
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్​): 30 – 40 సంవత్సరాలు
కేంద్ర పరిశోధన బృందం (సపోర్ట్): 25 – 35 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు..

జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి. SC, ST, PwBD అభ్యర్థులకు ఉచితంగా అప్లయ్​ చేసుకునే అవకాశం ఉంది. 

ఎంపిక ప్రక్రియ..

షార్ట్​ లిస్టు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టెలిఫోన్​,వీడియో ఇంటర్వ్యూలు, CTC చర్చల ద్వారా సెలక్షన్​ ఉంటుంది. ఇంటర్వ్యూ స్కోర్‌ల ఆధారంగా తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు.