గ్రోకిపీడియా(Grokipedia)..ఎలాన్ మస్క్ మరో సృష్టి. వికీపిడియాకు పోటీగా దీనిని ప్రారంభించారు ఎలాన్ మస్క్. ఖచ్చితత్వం, నిజమైన కంటెంట్ ను అందించే ప్లాట్‌ఫాం అని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ఇది ఏఐ చాట్ బాట్ గ్రోక్తో పనిచేస్తుంది. గ్రోకీపిడియా ప్రారంభ వర్షన్ 0.1 లాంచ్అయిన కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూవర్స్ ను సంపాదించింది. ఎంతలా అంటే ఆ ట్రాఫిక్ ఏకంగా వెబ్ సైట్ క్రాష్ అయింది. తర్వాత తిరిగి ప్రారంభమయిది.
గ్రోకిపిడియా.. ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 8లక్షల 85వేల ఎంట్రీలను చూసింది. ఆన్‌లైన్‌లో అత్యంత సాధారణంగా ఉపయోగించే ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాకు పోటీదారుగా నిలిచింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే గ్రోకిపీడియాలోని కొంత కంటెంట్ వికీపీడియా నుంచి తీసుకున్నారు. క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్అలైక్ 4.0 లైసెన్స్ కింద లైసెన్స్ పొంది ఈ కంటెంట్‌ను తీసుకున్నట్లు సూచించే డిస్క్లైమర్‌ను కూడా డిస్ ప్లే చేశారు.
గ్రోకీపిడియా వర్సెస్ వికీపిడియా..
గ్రోకీపిడియాకు, వీకిపిడియాకు ప్రధాన తేడా ఏంటంటే.. వికీ పిడియాలో ఎవరైనా కంటెంట్ ను రాయొచ్చు. ఎడిట్ చేయొచ్చు.. కానీ గ్రోకీపిడియాలో అలా కాదు. కంటెంట్ ను యూజర్లు ఎడిట్ చేసే అవకాశం ఉండదు.
గ్రోకిపీడియాను ఎలా ఉపయోగించాలంటే..
- ఈ కొత్త AI-ఆధారిత ఎన్సైక్లోపీడియా గ్రోకిపీడియాను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
- గ్రోకిపీడియా వెబ్‌సైట్ - https://grokipedia.com/ ను సందర్శించాలి. సెర్చింగ్ బార్ లో ఏది కావాలో టైప్ చేయాలి.
- మీకు కావాల్సిన స్టోరీ దొరుకుతుంది.
- ఇందులో మార్పులకు అవకాశం ఉండదు. మీ అభిప్రాయాన్ని మాత్రమే ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.
గ్రోకిపీడియా vs వికీపీడియా: ఏది మంచిది?..
గ్రోకిపీడియా పనిచేసే విధానంలో వికీపీడియా కంటే ప్రాథమికంగా చాలా భిన్నంగా ఉంటుంది.ఎందుకంటే ఇది AI- ఆధారిత ఇన్ ఫర్మేషన్ ప్రొడక్షన్ ప్లాట్ ఫాం. అయితే వికీపీడియా ఓపెన్ కమ్యూనిటీ ఎడిటింగ్ మోడల్‌ను ఉపయోగిస్తుంది.
►ALSO READ | Tata Trust Issue: టాటా ట్రస్టుల్లో ముదిరిన అంతర్గత విభేదాలు.. మెహ్లీ మిస్త్రీ ఔట్..!
గ్రోక్ లక్ష్యం ఖచ్చితమైన సమాచారం.. ఇది తప్ప మరొకటి కాదు. నిజం చెప్పడంతో మనం ఎప్పటికీ పరిపూర్ణం కానప్పటికీ ఆ లక్ష్యం వైపు వెళ్తున్నాం అని ఎలాన్ మస్క్.. ఈ గ్రోకీపిడియా లాంచింగ్ తర్వాత ప్రకటించారు.
