తమిళనాడు పాలిటిక్స్ కు, సినీ గ్లామర్ కు విడదీయరాని అవినావ సంబంధం ఉంది. దశాబ్దాలుగా వెండితెరపై రాజ్యమేలిన సూపర్ స్టార్లే అక్కడ రాజకీయ కోటలనూ ఏలారు. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ( TVK ) తమిళనాట సంచనాలు సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో మరో పొటికల్ పార్టీ రెడీ అవుతోంది. స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు స్కెచ్ పూర్తి చేశారు.
తన రాజకీయ ఎంట్రీపై ఆల్రెడీ సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన ధనుష్.. తన కొత్త రాజకీయ పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం (ECI) వద్ద రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. . 'తమిళగ ఎళుచ్చి కళగం' (తమిళనాడు పురోగమన పార్టీ / తమిళ చైతన్యం) పేరుతో ఈ పార్టీ నమోదు ప్రక్రియ జరిగినట్లు సమాచారం. ధనుష్ పార్టీ ఏర్పాటుపై ఇప్పడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. అటు ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
ధనుష్ ఇప్పటికే తన అభిమాన సంఘాలను జిల్లా, నియోజకవర్గాల వారీగా రీ-స్ట్రక్చర్ చేసి, ప్రత్యేకమైన IT Wingను రంగంలోకి దించారు. అంతేకాదు, ఇటీవల ఫ్యాన్స్ రూపొందించిన ఒక ప్రత్యేక జెండాను సైతం ఆయన ఆవిష్కరించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, లోకల్ సాధకులను సత్కరించడం, అభిమానులతో సమన్వయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రసంగాలు ఇస్తూ పక్కా పొలిటికల్ పునాది వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాకుండా, 2031 తమిళనాడు శాసనసభ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ధనుష్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు కోలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు ధనుష్ 'ఓం' సినిమా రిలీజ్‌తో పాటు అరడజను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాయి. అయితే త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు దశాబ్దాల డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ షాక్ ఇవ్వగా.. ఇప్పుడు ధనుష్ రాకతో తమిళ రాజకీయం మరెంత వేడెక్కుతుందో చూడాలి..
