వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాం..ఆయిల్ ఫామ్సాగుతో మంచి లాభాలు

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాం..ఆయిల్ ఫామ్సాగుతో మంచి లాభాలు


    రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు
జయశంకర్​ భూపాలపల్లి/ మొగుళ్లపల్లి, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పేర్కొన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పాత ఇస్సీపేటలో10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జంక్షన్లు, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల భూములు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతులను ప్రోత్సహిస్తూ పామాయిల్ సాగు విస్తరణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పామాయిల్ సాగుకు ఎకరానికి ఏడాదికి రూ.51 వేల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళ స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి అందజేశారు.