డబుల్ ఇల్లు కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ కాళ్లపై పడి వేడుకున్న ముసలవ్వ

డబుల్ ఇల్లు కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ కాళ్లపై పడి వేడుకున్న ముసలవ్వ

సిరిసిల్లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తనకు ఇల్లు కేటాయించాలంటూ.. ఓ వృద్ధురాలు సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ కాళ్లపై పడి వేడుకున్నారు. ఉన్నోళ్లకే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నారని… లేనోళ్లమైన తమ పరిస్థితి ఏంటని కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్త తిరిగి తిరిగి బీపీతో పడిపోయాడని.. తమ పరిస్థితి ఏంటని ఆమె ఆవేదనగా చెప్పింది. కేసీఆర్ ఏం చెప్పాడు.. ఏం చేస్తున్నాడని నిలదీసింది.