వ్లాగ్ చేస్తుండగా రష్యన్ యూట్యూబర్ పై వేధింపులు.. వీడియో వైరల్

వ్లాగ్ చేస్తుండగా రష్యన్ యూట్యూబర్ పై వేధింపులు.. వీడియో వైరల్

యూట్యూబ్‌లో 'కోకో ఇన్ ఇండియా' పేరుతో పాపులర్ అయిన రష్యన్ యూట్యూబర్ ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్‌లో వ్లాగింగ్ చేస్తుండగా వేధింపులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో, ఒక వ్యక్తి రష్యన్ మహిళతో సంభాషణలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. అతను తన స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నారా అని ఆమెను అడగడం ఇందులో చూడవచ్చు. అతని ప్రతిపాదనను తిరస్కరించిన ఆమె.. అతని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ అతను మాత్రం ఆమెను అనుసరిస్తూనే ఉంటాడు.

నా స్నేహితుడు, నేను సరోజినీ నగర్‌లో ఉన్నాను అని రష్యన్ వ్లాగర్ చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి ఆమెను అనుసరించడం, ఆమె అతనితో స్నేహం చేయాలనుకుంటున్నారా అని అడగడం ఈ వీడియోలో చూడవచ్చు. "నువ్వు నా స్నేహితుడివి కాగలవా" అని ఆ వ్యక్తి అడగ్గా.. ఆ మహిళ హిందీలో, “లేకిన్ మై ఆప్కో న్హీ జాంతి హు” (కానీ నాకు మీరు తెలియదు) అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి, “మనం స్నేహితులైన తర్వాత ఒకరినొకరు తెలుసుకోవచ్చు అన్నాడు.

అయితే రష్యన్ మహిళ అతని విధానాన్ని ఖండించింది. తనకు కొత్త స్నేహితులను కోరుకోవడం లేదని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి.. నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అని ఆమెను అసౌకర్యానికి గురిచేశాడు. కోకో యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.