మాజీ ప్రధాని మన్మోహన్‌‌కు భారత రత్న ఇవ్వాలి

V6 Velugu Posted on Sep 26, 2020

న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారంతో 88వ పడిలోకి అడుగు పెట్టారు. పీఎం మోడీతోపాటు చాలా మంది ప్రముఖులు, నేతలు మన్మోహన్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్‌‌కు భారత రత్న ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. మన్మోహన్‌‌ సాధారణ నేపథ్యం నుంచి అంచెలంచెలుగా ఎదిగారని, దీనికి ఆయన చదువు, స్కాలర్‌‌షిప్ కారణమన్నారు. ‘మన్మోహన్ సింగ్ అందించిన సేవలకు మొత్తం దేశం గర్విస్తోంది. యువతీ యువకులకు ఉదాహరణగా నిలిచేలా ఆయన తన జీవితాన్ని మలుచుకున్నారు. బ్రతికి ఉన్న వాళ్లలో ఎవరికైనా భారత్ రత్న ఇవ్వాల్సి వస్తే తప్పకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్‌‌కు ఇవ్వాలి. ఆయన దానికి అర్హులు’ అని చిదంబరం ట్వీట్ చేశారు.

Tagged Ex PM Manmohan Singh, chidambaram, Bharata Ratna, servicess

Latest Videos

Subscribe Now

More News