ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌లో గురుకుల అభ్యర్థుల ధర్నా

 ఇందిరాపార్క్  ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌లో గురుకుల అభ్యర్థుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ అన్ ఎంప్లాయిస్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌‌‌‌‌‌‌‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.  గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో మొదట పై స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాతనే  కింది స్థాయి ఉద్యోగాలను నింపాలని డిమాండ్ చేశారు.  నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మినారాయణ హాజరై అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.  ఈ సందర్భంగా నీల వెంకటేశ్ మాట్లాడుతూ..  గత గురుకుల నియామకాల్లో బ్యాక్‌‌‌‌‌‌‌‌ లాగ్‌‌‌‌‌‌‌‌ ఖాళీలు లేకుండా భర్తీ చేసిన బోర్డు ఇప్పుడు ఎందుకు బ్యాక్‌‌‌‌‌‌‌‌ లాగ్‌‌‌‌‌‌‌‌ పోస్టులు కావాలని చూపిస్తుందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు మాధగోని సైదులు గౌడ్‌‌‌‌‌‌‌‌, కొండపల్లి శ్రీను, అస్మా, రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాల్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.