
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు. ఫలితాలు వచ్చాక సమగ్రంగా విశ్లేషించుకుంటామని చెప్పారు. వివిధ స్థాయిల్లో లోటుపాట్లు తదితర అంశాలపై చర్చించి వాటిని అధిగమించి లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు సాగుతామని చెప్పారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బసవరాజ్ బొమ్మై.. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ పై 20,000 ఓట్లకు పైగా గెలుపొందారు. బొమ్మైకి 59,242 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పఠాన్‌కు 37,723 ఓట్లు వచ్చాయి.