మరో యుద్ధానికి సిద్ధం: ఇంట్రస్టింగ్ గా వన్ బ్యాటిల్ ఆఫ్టర్‌‌‌‌ అనదర్‌‌‌‌ ట్రైలర్..

మరో యుద్ధానికి సిద్ధం: ఇంట్రస్టింగ్ గా వన్ బ్యాటిల్ ఆఫ్టర్‌‌‌‌ అనదర్‌‌‌‌ ట్రైలర్..

హాలీవుడ్ స్టార్ లియోనార్డో డెకాఫ్రియో నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్‌‌‌‌ అనదర్‌‌‌‌’. పాల్ థామస్ ఆండర్సన్‌‌ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. సీన్ పెన్‌‌,  బెనిసియో డెల్‌‌ టోరో, రెజీనా హాల్‌‌,  టేయానా టేలర్‌‌‌‌, చేజ్‌‌ ఇన్ఫినిటీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. గురువారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. తన పాత జీవితాన్ని వదిలేసి భార్య పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్‌‌ లీడ్ చేస్తుంటాడు హీరో.  పదహారేళ్ల తర్వాత పాత శత్రువులు ప్రతీకారం తీర్చుకునేందుకు అతని జీవితంలోకి తిరిగి వస్తారు. 

వాళ్ల నుంచి అతని కుటుంబం ఎలా తప్పించుకుంది, తన ఫ్యామిలీని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ. నైంటీస్‌‌లో థామస్‌‌ పిన్‌‌చాన్‌‌ రాసిన ‘వైన్‌‌ ల్యాండ్‌‌’ అనే నవల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌‌ సీన్స్‌‌తో కట్ చేసిన ట్రైలర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ట్రైలర్‌‌‌‌ చివర్లో స్పీడ్‌‌గా వెళుతున్న కారు నుంచి డెకాఫ్రియో దూకడానికి ప్రయత్నిస్తుంటే.. మరో నటుడు బెనిసియో డెల్‌‌ టోరో ‘‘టామ్ క్రూజ్‌‌’ చెప్పిన ‘ఫ్రీడమ్ ఈజ్ నో ఫియర్‌‌‌‌’ అనే మాట నీకు తెలుసా..’ అనడం ట్రైలర్‌‌‌‌కు హైలైట్‌‌గా నిలిచింది. ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వార్నర్ బ్రదర్స్‌‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.  సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది.