ఏపీలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న JBT ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి..

ఏపీలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న JBT ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి..

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అరుణాచలం నుండి హైదరాబాద్ వెళ్తున్న జేబీటి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం ( మే 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దగ్గర జరిగింది ఈ ఘటన. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

అరుణాచలం నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. 

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.