
కుషాయిగూడ, వెలుగు: రూల్స్‌కు విరుద్ధంగా రోడ్ల వెంట ఫ్లెక్సీలు కట్టించినందుకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి జీహెచ్ఎంసీ ఆఫీసర్లు రూ.లక్ష ఫైన్ వేశారు. ఇటీవల ఎమ్మెల్యే పేరిట హబ్సిగూడ నుంచి ఉప్పల్వరకు కేసీఆర్, కేటీఆర్ఫొటోలతో రోడ్డు వెంట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు. గుర్తించిన జీహెచ్ఎంసీ సెంట్రల్ఎన్ ఫోర్స్మెంట్సెల్ఆఫీసర్లు రూ.లక్ష చలాన్లు విధించారు. జనానికి చెప్పాల్సిన ఎమ్మెల్యేనే ఇలా రూల్స్బ్రేక్చేయడంపై నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.