
వరంగల్ సిటీ, వెలుగు: నీట్ పీజీ కటాఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో కన్వీనర్, యాజమాన్య కోటాలో దరఖాస్తుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ కటాఫ్ స్కోర్‌ను అన్ని కేటగిరీలకు ‘0’ పర్సెంటైల్ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు ఈ నెల 24 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. వివరాలకు www.knruhs.telangana.gov.inను చూడాలని వర్సిటీ అధికారులు తెలిపారు.