V6 News

బోథ్కు మరిన్ని ఇండ్లు మంజూరు చేయండి  :  ఆడే గజేందర్

బోథ్కు మరిన్ని ఇండ్లు మంజూరు చేయండి  :  ఆడే గజేందర్

నేరడిగొండ, వెలుగు: బోథ్ నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడే గజేందర్ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కోరారు. హైదరాబాద్ లో మంత్రిని మాజీ మంత్రి వేణుగోపాలాచారితో మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ నియోజకవర్గంలో పక్కా ఇండ్లు లేక నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని.. నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు గజేందర్ తెలిపారు. ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోతారెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ చట్ల ఉమేశ్ తదితరులున్నారు.