V6 News

అంగన్ వాడీల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

అంగన్ వాడీల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్ తోపాటు, ఖానాపూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అంగన్​వాడీ టీచర్స్​కు సెల్​ఫోన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని సక్రమంగా అందించాలన్నారు.

సెల్ ఫోన్ల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మంత్రి సీతక్క పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను బొజ్జు ఖండించారు.  మంత్రి సీతక్కపై లేనిపోని ఆరోపణ లు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజిద్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మక్క కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖానాపూర్ 7వ వార్డులో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ ​మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు