V6 News

ఓటు వేసేందుకు వచ్చి ఒకరు మృతి.. కొడంగల్ మండలం చిన్న నందిగామలో ఘటన

ఓటు వేసేందుకు వచ్చి ఒకరు మృతి.. కొడంగల్ మండలం చిన్న నందిగామలో ఘటన

కొడంగల్‌‌, వెలుగు: పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామానికి ఓటు వేసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్​లో కేటరింగ్​ పని చేసుకునే ఆనంద్​(27), భరత్​కుమార్, ఆనంద్​​ ఓటు వేసేందుకు తమ సొంత గ్రామం కొడంగల్​ మండలంలోని చిన్ననందిగామాకు వచ్చారు. ఓటు వేసి తిరిగి బైక్​పై తిరిగి వెళ్తుండగా బైక్​ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆనంద్​ స్పాట్​లోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ భరత్​కుమార్​, నర్సింహులును హైదరాబాద్​కు తరలించారు.