ఇండియాలో వన్‌‌‌‌ప్లస్ నార్డ్ వాచ్ లాంచ్

 ఇండియాలో వన్‌‌‌‌ప్లస్ నార్డ్ వాచ్ లాంచ్

వన్‌‌‌‌ప్లస్ నార్డ్ వాచ్ సోమవారం ఇండియాలో లాంచ్​ అయింది. ఇందులోని 1.78-అంగుళాల అమోలెడ్​ డిస్​ప్లేకు 60హెజ్​ రిఫ్రెష్ రేటు ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్​లో 105 స్పోర్ట్స్ మోడ్‌‌లు ఉంటాయి. హార్ట్​రేట్​, ఒత్తిడి, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, నిద్ర వంటి వాటిని మానిటర్​ చేస్తుంది. జీపీఎస్  ఫీచర్​​ సైతం ఉంది. బ్యాటరీ 10 రోజుల వరకు వస్తుంది. నెల రోజుల వరకు స్టాండ్​బై టైం ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.ఐదు వేలు. వన్​ప్లస్ స్టోర్​​, అమెజాన్​ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంకుల క్రెడిట్​కార్డులతో కొంటే రూ.500 వరకు డిస్కౌంట్​ ఇస్తారు.