శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండడంతో తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఇన్ ఫ్లో 46,508 క్యూసెక్ లు, ఔట్ ఫ్లో 40,259 క్యూసెక్కులు (విద్యుత్ ఉత్పత్తి ద్వారా) ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 864.30 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 120.0754 టీఎంసీలకు నీరు చేరింది.

