తొమ్మిది మంది క్షేమమేనా.? కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్..

తొమ్మిది మంది క్షేమమేనా.? కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్..

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం వద్ద  సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు సొరంగంలో చిక్కుకున్నారు. 8 మందిని రక్షించగా..మిగతా తొమ్మిది మంది కోసం రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దట్టమైనపొగలు కమ్ముకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గుతుంది.  విద్యుత్ కేంద్రంలో పొగను తగ్గించేందుక మూడు ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. పొగను తగ్గించుకుంటూ సిబ్బంది లోపలికి వెళుతున్నారు. మరో వైపు   లోపల చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు  పొగ కారణంగా ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ ప్రమాద ఘటన పై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్,జగన్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్  బండి సంజయ్ కుమార్ ,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

see more news

29 లక్షలు దాటిన కేసులు..54 వేలు దాటిన మరణాలు

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు