
వర్షాలతో రాష్ట్రంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కూరగాయల దిగుబడి అయితే పూర్తిగా తగ్గిపోయింది. దాంతో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఐదు వందలు పెట్టినా.. ఐదు రకాల కూరగాయలు కూడా రావటం లేదు. ఏం కొందామన్న కేజీ 60 రూపాయల పైనే ఉంది. ఇక ఉల్లిగడ్డ అయితే ఏకంగా హోల్‌సేల్ మార్కెట్‌లో 100 రూపాయలు పలుకుతుంటే… బయట కేజీ 120 రూపాయల వరకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, దొండకాయలు కేజీ 60 రూపాయల నుంచి 100రూపాయల పైనే ఉన్నాయి. కూరగాయల ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు మార్కెట్ల వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కూరగాయల ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం కల్పించుకొని.. రేట్లు తగ్గేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది ఇలా ఉండగా.. భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట పూర్తిగా పాడైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయల పెట్టుబడి పెడితే కనీసం 10 వేలు కూడా రావడంలేదని వాపోతున్నారు. కూరగాయల పంట వేయడం వల్ల లాభలేమో గానీ అప్పులైతే మిగిలాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.
For More News..