
ఐపీఎల్ మ్యాచులను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే..కొందరు అక్రమార్కులు మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నిర్వహిస్తూ డబ్బులను సంపాదించుకుంటున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్ నగర్ లో ని స్ట్రీట్ నెంబర్ 8 లోని ఓ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులుదాడులు చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. లక్షా 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ఇన్ స్టాల్ చేసిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : అప్పులు చేసి IPL బెట్టింగ్స్
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌కావడంతో జోరుగా క్రికెట్ బెట్టింగ్ లు నడుస్తున్నాయి. లోన్ యాప్స్నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక కొందరు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్యాప్స్పై నిషేధం ఉన్నా కూడా రోజుకు వందల్లో యాప్స్పుట్టుకొస్తున్నాయి. యూ ట్యూబ్, సోషల్‌మీడియా, వెబ్సైట్లలో వంద పెడితే వెయ్యి అంటూ బెట్టింగ్యాప్స్ ప్రకటనలు ఇస్తున్నాయి. ఆశ పెట్టి చివరకు జనాల జేబులకు చిల్లుపెడుతున్నాయి. వన్ ఎక్స్ బెట్, మెగాపరి, మేట్‌బెట్, బెట్365, డఫ్పా బెట్లాంటి వెబ్‌సైట్స్, యాప్స్‌లో ప్రస్తుతం బెట్టింగ్జోరుగా నడుస్తుంది. సాధారంగా ఆన్లైన్ బెట్టింగ్స్‌లో నష్టపోయిన బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేయడంలేదు. ఇదే అదనుగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల దృష్టికి వెళ్లిన సైట్లను మాత్రమే బ్లాక్ చేస్తున్నారు.