అప్పులు చేసి IPL బెట్టింగ్స్.. నష్టపోయానని హైదరాబాద్లో యువకుడు ఆత్మహత్య

అప్పులు చేసి IPL బెట్టింగ్స్.. నష్టపోయానని హైదరాబాద్లో యువకుడు ఆత్మహత్య

బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కష్టం లేకుండా ఈజీగా సంపాదించవచ్చుననే ఆలోచనతో చాలా మంది ఈ ఊబిలోకి దిగుతున్నారు. అప్పులు చేసి మరీ బెట్టింగ్ లకు పాల్పడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. తీవ్ర నష్టాలతో అప్పు తేర్చే మార్గం కనబడక పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించినా, అవగాహన కల్పించినా పెడచెవిన పెడుతూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

బెట్టింగ్ యాప్స్ కు యువకుడు బలైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ పరిధిలోని గౌడవెళ్లి గ్రామానికి చెందిన  ఆటోడ్రైవర్ యాదగిరి కి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు రాహుల్ (24) ఇంటర్ వరకు చదివి ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 

►ALSO READ | రూ.4.76 కోట్లకు 49.80 కోట్ల లాభాలు.. బ్లాక్ డ్రేటింగ్‌‌‌‌ పేరుతో సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల మోసం..

 రాహుల్  అలియాస్ సన్నీ స్నేహితులతో  మద్యం తాగడం, ఆన్ లైన్  బెట్టింగులకు పాల్పడటం అలవాటుగా మారింది. గత  కొన్ని రోజులుగా అప్పులు చేసి ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు పెడుతూ వస్తున్నాడు. మొదట్లో లాభం వచ్చినట్లు కనిపించినా ఆ తర్వాత వరుస నష్టాలు రావడంతో  రూ.4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. 

మంగళ, బుధ వారాల్లో (ఏప్రిల్ 29,30) బెట్టింగ్ లో డబ్బులు పోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఇంట్లో పై పోర్షన్లోని తన గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లి కూడా కాని తమ కొడుకు రాహుల్.. చిన్న వయసులోనే తమకు దూరం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.