మెట్రో సర్వీసులకు బ్రేక్ : మియాపూర్ టూ ఎల్బీనగర్ రూట్లో ఆగిన రైళ్లు

మెట్రో సర్వీసులకు బ్రేక్ : మియాపూర్ టూ ఎల్బీనగర్ రూట్లో ఆగిన రైళ్లు

హైదరాబాద్ మెట్రో సర్వీసులకు బ్రేక్ పడింది. సాంకేతిక లోపంతో రైళ్లు నిలిచిపోయాయి. 2025, మే ఒకటో తేదీ మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది ఇది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్లో.. భరత్ నగర్ మెట్రో స్టేషన్ లో 20 నిమిషాలు ఆగిపోయింది రైలు. దీంతో ఆ రూట్ లోని అన్ని సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

Also Read : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 3.5 కోట్ల బంగారం సీజ్

ప్రతి మెట్రో స్టేషన్ లోనూ రైలు ఆగిపోవటంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఎంతసేపటికీ రైలు కదలకపోవటంతో.. కొంత మంది ప్రయాణికులు.. బయటకు వచ్చి బస్సుల్లో వెళ్లిపోయారు. సాంకేతిక కారణాలతో రైలు ఆగిపోయినట్లు ప్రకటించింది మెట్రో. మియాపూర్ రూట్లో రైళ్లు ఆగిపోవటంతో.. చాలా మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ ఇష్యూస్ ను సరిచేయటానికి సిబ్బంది కృషి చేస్తున్నట్లు ప్రకటించింది మెట్రో అథారిటీ. 
మే ఒకటో తేదీ హాలిడే కావటంతో రద్దీ తక్కువగా ఉంది.