
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 2025,మే 1 వ తేదీన ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. అతని దగ్గర 3500 గ్రాముల బంగారాన్ని గుర్తించారు అధికారులు.
Also Read : ఎగబడి బంగారం కొంటే నష్టపోతారు..
బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.3.45 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అధికారులు.