RR vs MI: గేల్, డివిలియర్స్‌లను బౌల్డ్ చేశాను.. 14 ఏళ్ళ సూర్యవంశీతో జాగ్రత్తగా ఉండాలి: వరల్డ్ క్లాస్ బౌలర్

RR vs MI: గేల్, డివిలియర్స్‌లను బౌల్డ్ చేశాను.. 14 ఏళ్ళ సూర్యవంశీతో జాగ్రత్తగా ఉండాలి: వరల్డ్ క్లాస్ బౌలర్

ఐపీఎల్ 2025 లో గురువారం (మే 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ముంబై ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ను తక్కువగా అంచనా వేస్తే పొరపాటే అవుతుంది. గుజరాత్ టైటాన్స్ పై విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్యంగా రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారారు. ప్రారంభంలోనే ఈ జోడీని విడగొట్టకపోతే ముంబై మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. 

ALSO READ | బ్లిట్జ్ టోర్నీలో టైటిల్ రేసులో ప్రజ్ఞానంద

అన్నిటికంటే ముఖ్యంగా నేడు జరగబోయే మ్యాచ్ లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ కుర్రాడు ఉన్న కాన్ఫిడెంట్ చూస్తుంటే ఈ రోజు కూడా ముంబై బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ 14 ఏళ్ళ కుర్రాడు చెలరేగాలని రాజస్థాన్ యాజమాన్యం కోరుకుంటుంది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు ముందు వైభవ్ పై ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

బోల్ట్ మాట్లాడుతూ.. " నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రమాదకర బ్యాటర్లు క్రిస్ గేల్స్, ఎబి డివిలియర్స్‌లకు ఐపీఎల్ టోర్నీలో నాణ్యమైన బౌలింగ్ వేశాను. నేను 14 ఏళ్ల పిల్లాడి గురించి నాకు ఎలాంటి ఆందోళన లేదు. అయితే అతనికి జాగ్రత్తగా బౌలింగ్ చేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం అతను ఉన్న హాట్ ఫామ్‌లో బౌలింగ్ చేయడం సవాలుగా మారింది. మొన్న రాత్రి ప్రపంచం మొత్తం వైభవ్ ప్రదర్శన చూసింది. అంత చిన్న పిల్లవాడు నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడడం గొప్ప విషయం". అని ఈ కివీస్ పేసర్ తెలిపాడు. 

ఈ సీజన్ లో ముంబై ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతుంది. నేడు జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరోవైపు ముంబై గెలిస్తే 7 విజయాలతో ప్లే ఆఫ్స్ కు దగ్గరవవుతుంది.