
మహబూబాబాద్ జిల్లాలోని అంగన్ వాడీ సెంటర్లో మురిగిపోయిన కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. చిన్నపిల్లలు తినే గుడ్లలో మురుగు రావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
జిల్లా కేంద్రంలోని హనుమంతుని గడ్డ ,గూగుల్ మల్లయ్య బజార్ లోని అంగన్ వాడీ సెంటర్ లో ఓ విద్యార్థికి అంగన్ వాడీ సిబ్బంది కోడిగుడ్లు అందజేసింది. కోడిగుడ్డు పగలగొట్టి చూడగా మురిగిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ALSO READ | కోహెడలో ఉద్రిక్తత..పోలీసుల ముందే కత్తులు, కర్రలతో పొట్టుపొట్టు కొట్టుకున్నరు
ఇదేనా చిన్నారులకు అందించే పౌష్టికాహారం అంటూ అంగన్ వాడీ సిబ్బందిని నిలదీశారు తల్లిదండ్రులు. చిన్నారులు, గర్భిణులకు, బాలింతలకు సప్లై చేసిన గుడ్లను పగలగొట్టి చూడగా మురుగు బయట పడటంతో ఇలాంటి గుడ్లు తింటే తమ పరిస్థితి ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరచుగా ఇలాగే జరుగుతున్నా కాంట్రాక్టర్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అంగన్వాడీ టీచర్లను నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నాణ్యమైన గుడ్లు అందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.