
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ ప్రస్తుత సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత రెండు సీజన్ లుగా ఐపీఎల్ ఆడుతున్నా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అతనికి మంచి గుర్తింపు లభించింది. వరుస అవకాశాలు రావడంతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 4 వికెట్లు పడగొట్టి మిడిల్ ఓవర్స్ లో ఆర్సీబీకి కీలక బౌలర్ గా మారాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ యువ బౌలర్ ఇటీవలే ఆర్సీబీ యాజమాన్యంపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
తన హెర్నియా సర్జరీకి సహాయం చేసినందుకు సుయాష్ శర్మ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కృతజ్ఞతలు తెలిపాడు. గాయం కారణంగా ఐపీఎల్ లో అసలు తాను ఆడతానని ఊహించలేదని ఈ లెగ్ స్పిన్నర్ తెలిపాడు. సుయాష్ శర్మ మాట్లాడుతూ.. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెండు సంవత్సరాల క్రితం వరకు నేను ఇంజెక్షన్లు తీసుకుంటూ క్రికెట్ ఆడేవాడిని. నా సమస్య ఏమిటో తెలియకపోవడంతో నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. RCB నన్ను సర్జరీ కోసం లండన్‌కు పంపింది. అక్కడ నాకు జేమ్స్ బాగా చూసుకున్నాడు.
జేమ్స్ తో పాటు అతని కుటుంబం నన్ను స్వంత వ్యక్తిలా చూసుకున్నారు. నాకు మూడు హెర్నియాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నా సర్జరీ తర్వాత నేను మొదటి మ్యాచ్ ఆడతానని కూడా ఊహించలేదు. నా సర్జరీ చాలా పెద్దది కాబట్టి మూడు లేదా నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఆడాలని నాకు చెప్పారు. నేను ఈ ఫ్రాంచైజీకి వచ్చినందుకు నిజంగా కృతజ్ఞుడను. ప్రస్తుతం నేను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాను." అని సుయాష్ RCB బోల్డ్ డైరీస్‌లో అన్నారు.
Suyash Sharma said, "RCB sent me to London for my surgery, they invested in me a lot". ❤️
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2025
- A lovely interview of Suyash!pic.twitter.com/cFBxPqLgTB
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతుంది. ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పత్తిఆకాలో టాప్ లో ఉంది. ఆర్సీబీ ఖాతాలో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో మరో మ్యాచ్ గెలిచినా అలవోకగా ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెడుతుంది.
ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తదుపరి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం (మే 3) ఆడనుంది. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 9 న లక్నో సూపర్ జయింట్స్ తో.. మే 13 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో.. మే 17 న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ మ్యాచ్ లు ఆడనుంది.