
హైదరాబాద్ హయత్ నగర్ లోని కోహెడలో ఉద్రిక్తత నెలకొంది.. ఫ్లాట్ ఓనర్స్, ఫాంహౌస్ యజమానికి మధ్య నెలకొన్న వివాదం రాళ్ళ దాడికి దారి తీసింది. గురువారం ( మే 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. హయత్ నగర్ కోహెడలోని సర్వే నంబర్ 951, 952 దగ్గర ఫ్లాట్ ఓనర్స్, ఫామ్ హౌస్ యజమానికి వివాదం నెలకొంది. సదరు సర్వే నంబర్స్ లో ఉన్న ఫామ్ హౌస్ కొంతభాగం కూల్చేసింది హైడ్రా.
కోర్టు ఆర్డర్స్ తో హైడ్రా ఫామ్ హౌస్ కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో ఫ్లాట్స్ క్లీన్ చేస్తుండగా అడ్డుకున్నారు ఫామ్ హౌస్ నిర్వాహకులు. దీంతో ఫామ్ హౌస్ యజమానికి ఫ్లాట్ ఓనర్స్ కి వాగ్వాదం మొదలైంది. వాగ్వాదం, కాస్తా రాళ్ళ దాడికి దారి తీసింది. ఈ దాడిలో పలువురు ఫ్లాట్ ఓనర్స్ కి తీవ్ర గాయాలయ్యాయి.
►ALSO READ | బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్దమే: సీఎం రేవంత్