న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను ఏప్రిల్ నుంచి నిలిపివేసేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. ఫాస్ట్ ట్యాగ్, యూపీఐ ద్వారానే చెల్లింపులు అనుమతించనున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించడం, పారదర్శకత పెంచడం దీని ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం 98 శాతం వాహనాలు ఫాస్ట్‌ట్యాగ్ వాడుతున్నాయి. నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు చార్జీ వసూలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,150 టోల్ ప్లాజాల్లో ఇది అమలు కానుంది.
