లంచం డిమాండ్: ACBకి చిక్కిన ఓపెన్ స్కూల్ టీచర్

లంచం డిమాండ్: ACBకి చిక్కిన ఓపెన్ స్కూల్ టీచర్

విజయనగరం జిల్లా : లంచం తీసుకుంటూ ACBకి చిక్కాడు ఓపెన్ టీచర్. ఈ సంఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. ఎల్.కోట మండలం చందులూరు ప్రభుత్వ స్కూల్ లో సాయి కృష్ణారావు డిప్యూటీ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. అయితే ఓపెన్ స్కూల్ 2017, 18 సంవత్సరాల పదవ తరగతి పాసైన విద్యార్దులకు టీసీ, మార్క్స్ లిస్ట్ లు ఇచ్చేందుకు రూ. 7 వేలు డిమాండ్ చేశాడు సాయి కృష్ణారావు.

దీంతో విద్యార్ధులు ACB కాల్ సెంటర్ ని ఆశ్రయించడంతో స్పందించిన అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. శుక్రవారం విద్యార్దుల నుంచి రూ 7 వేలు లంచం తీసుకుంటుండగా సాయి కృష్ణారావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ACB అధికారులు.