
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన సంకల్పం, సకాలంలో ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారానికి ప్రతిబింబమే ఆపరేషన్ సిందూర్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆప్ గ్రేడ్ చేసిన మల్టీ ఏజెన్సీ సెంటర్(ఎంఏసీ) ను శుక్రవారం అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ అనేది ప్రధాని మోదీ దృఢమైన రాజకీయ సంకల్పం, మన సంస్థల కచ్చితమైన నిఘా సమాచారం, సాయుధ దళాల అసమానమైన దాడి సామర్థ్యానికి ప్రత్యేక చిహ్నం” అని ఆయన తెలిపారు.
ముంబై టెర్రర్ అటాక్ దాడుల తర్వాత దేశవ్యాపంగా ఉన్న వివిధ భద్రతా సంస్థలు, నిఘా ఏజెన్సీల మధ్య సమచార మార్పిడి, సమన్వయానికి ఎంఏసీని స్థాపించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది.