యూపీలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు

యూపీలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు

లక్నో: హత్రాస్, బల్‌‌‌రాంపూర్ గ్యాంగ్ రేప్‌‌ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లుడవుతున్నాయి. ఈ ఘటనలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌‌పై విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అభివృద్ధి అజెండా నుంచి రాష్ట్రం గాడి తప్పాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని యోగి మండిపడ్డారు. ‘విపక్షాలు రోజుకో కుట్రను తెరపైకి తీసుకొస్తున్నాయి. యూపీలో కుల, మత అల్లర్లను రేకెత్తించడానికి యత్నిస్తున్నారు. మేం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అని యోగి చెప్పారు.