చైనాతో సరిహద్దు వివాదంపై రాజ్యసభలో దుమారం

చైనాతో సరిహద్దు వివాదంపై రాజ్యసభలో దుమారం

చైనాతో సరిహద్దుపై రాజ్యసభలో దుమారం రేగింది.  సరిహద్దు వివాదంపై సభలో చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో నిలబడి సభ్యులు నినాదాలు చేశారు.  చైనాతో సరిహద్దుపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టబట్టాయి. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్  జగదీప్ ధన్ కర్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు సమస్యలు రాజ్యసభలో పరిష్కారం కావని..సభ కేవలం చర్చావేదిక మాత్రమేనని అన్నారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. 

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో రెండు దేశాల సైన్యాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు.చైనా సైనికులు ఎక్కువగా గాయపడ్డారని కేంద్రం చెబుతోంది.  ఇదే విషయంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని ఈ సెషన్ లో ప్రతి రోజుల విపక్షాలు పట్టుబడుతున్నాయి. మోడీ చేతకాని తనం వల్లే చైనా భారత్ సరిహద్దుల్లో గొడవలు జరుగుతున్నాయని AICC అధ్యక్షులు మళ్లికార్జున ఖర్గే ఆరోపించారు.