
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2023 జూలై 25 ఉదయం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశమైన ఆయా పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రతిపాదనపై ప్రతిపక్షాలు చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. చివరిసారిగా 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారు.
In today's meeting, I.N.D.I.A parties discuss proposal to move no-confidence motion against govt: Sources https://t.co/EC22lOdE7r
— ANI (@ANI) July 25, 2023
మరోవైపు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మొదలైన మూడు నిమిషాలకే వాయిదా పడింది. సభ మొదలు కాగానే కాంగ్రెస్ తో పాటుగా విపక్షాలు మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.