లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..!

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..!

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్షాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. ఇదే అంశంపై ఇతర పార్టీల నేతలతో కాంగ్రెస్  చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానాన్ని  ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సభలో పక్షపాతంగా వ్యవహరించినందుకు బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయని సమాచారం.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని విపక్షాలన్నీ తప్పుపడున్నాయి. రాహుల్ విషయంలో స్వీకర్ తొందరపడ్డారని విపక్షాలు అంటున్నాయి.  2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఓం బిర్లాపై విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లుగా సమాచారం.