బంగారం అనుకుని అలంకరణ నగలు చోరీ... సూరారం లక్ష్మీ గణపతి  ఆలయంలో దొంగతనం  

బంగారం అనుకుని అలంకరణ నగలు చోరీ... సూరారం లక్ష్మీ గణపతి  ఆలయంలో దొంగతనం  
  • అడవిలో హుండీ పడేసిన దొంగలు

జీడిమెట్ల, వెలుగు: సూరారం పీఎస్​పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి గేటు తెరుచుకుని ఇంట్లోకి వచ్చి మ్యాన్​హోల్స్, సైకిల్స్​ఎత్తుకెళ్లడం నుంచి దేవాలయాల్లో హుండీలు పగల గొడుతూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. తాజాగా వైష్ణవినగర్​లోని లక్ష్మీగణపతి ఆలయంలో దొంగలు హుండీ ఎత్తుకెళ్లారు. 

ఆదివారం వైష్ణవి నగర్​ను ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. తాళాలు పగలగొట్టి బంగారు నగలు అనుకుని అమ్మవారి అలంకరణ నగలు ఎత్తుకుపోయారు. 

హుండీని దొంగిలించి భక్తులు వేసిన కానుకలను తీసుకున్నారు. తర్వాత హుండీని పక్కనే ఉన్న అడవిలో పడేశారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.