ఔటర్ రోడ్డులో మృతదేహం.. ఎగ్జిట్ నంబర్12 దగ్గర ఆదిబట్ల పోలీసులు గుర్తింపు

ఔటర్ రోడ్డులో మృతదేహం.. ఎగ్జిట్ నంబర్12 దగ్గర ఆదిబట్ల పోలీసులు గుర్తింపు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. ఆదిబట్ల సీఐ రవికుమార్​ తెలిపిన ప్రకారం.. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్ సమీపంలో ఔటర్ రింగ్​ రోడ్​ ఎగ్జిట్ నంబర్​ 12 నుంచి ఆదిబట్ల వెళ్లే సర్వీస్ రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. 30 ఏండ్ల వయస్సు ఉంటుందని, నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్​ టీం ఆధారాలు సేకరించింది. సంఘటనా స్థలాన్ని మహేశ్వరం అదనపు డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.