బీజేపీ- కాంగ్రెస్ మధ్య ఆస్కార్ పొలిటికల్ వార్

బీజేపీ- కాంగ్రెస్ మధ్య ఆస్కార్ పొలిటికల్ వార్

భారతదేశ చరిత్రలోనే అత్యంత కిలకమైన రోజు మార్చి 13.. రెండు ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి. దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోంది.. రాజకీయ పార్టీలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి.. ఆస్కార్ ను కూడా పొలిటికల్ మీమ్స్గా మార్చేసి.. కొత్త రచ్చకు తెర తీశాయి.. బీజేపీ – కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఆస్కార్ పొలిటికల్ రచ్చ ఏంటో చూద్దాం...

ట్రిబుల్ మూవీలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ నాటు నాటు పాటకు పేరడీ.. లూటో లూటో అంటూ కాంగ్రెస్ పార్టీ ఓ మీమ్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ – రాంచరణ్ ముఖాలకు..  ప్రధాని మోడీ, పారిశ్రామికవేత్త అదానీలను పెట్టారు.. నాటు నాటు ప్లేస్లో.. లూటో లూటో అంటూ క్యాప్షన్ పెట్టారు.. ఈ మీమ్ ను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేయటంతో వైరల్ అయ్యింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ గ్రూప్స్ దీన్ని రీ ట్విట్ చేస్తున్నాయి.. దేశాన్ని వీళ్లిద్దరూ లూటీ చేస్తున్నారంటూ అర్థం వచ్చే విధంగా దీన్ని తయారు చేయటం విశేషం..

బీజేపీ మాత్రం ఊరికే ఉంటుందా ఏంటీ.. లూటో లూటోకు పోటీగా.. హారో హారో మీమ్ తో కౌంటర్ చేసింది. ఎన్టీఆర్ – చెర్రీ ఫొటోలకు రాహుల్ గాంధీ, ఖర్గే ఫొటోలను పెట్టి.. నాటు నాటు ట్యూన్ ప్లేస్ లో హారో..హారో అంటూ క్రియేట్ చేసింది. ఓటమి ఓటమి అన్నట్లు.. మన లోకల్ భాషలో గోవిందా గోవిందా అన్నట్లు.. రాహుల్ – ఖర్గే ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్ప ఏమీ లేదన్నట్లు కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేలెత్తిచూపించింది బీజేపీ..

కాంగ్రెస్ మొదలు పెట్టిన లూటో లూటోకు పోటీగా బీజేపీ హారోహారో మీమ్స్ మాత్రం పొలిటికల్ ఆస్కార్ రేంజ్ లో వెళుతున్నాయి. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది.