ఉస్మానియా మెడికల్ కాలేజీకి మరోసారి ఐఎస్ఓ గుర్తింపు

ఉస్మానియా మెడికల్ కాలేజీకి మరోసారి ఐఎస్ఓ గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీ వరుసగా నాలుగోసారి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపును సాధించింది. ఐఎస్ఓ 9001–-2015 సర్టిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ఆ సంస్థ ప్రతినిధి శివయ్య, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావుకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ.. కాలేజీకి నాలుగోసారి ఈ గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

కాలేజీలో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంపొందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ గుర్తింపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన టీచింగ్ ఫ్యాకల్టీ, ఇతర సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చారి, డాక్టర్ పద్మావతి, డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.