గ్రూప్​1ను వాయిదా వేయాల్సిందే..ఓయూ స్టూడెంట్స్ చలో టీఎస్​పీఎస్సీ

గ్రూప్​1ను వాయిదా వేయాల్సిందే..ఓయూ స్టూడెంట్స్  చలో  టీఎస్​పీఎస్సీ

ఓయూ, వెలుగు: గ్రూప్​-1 ఎగ్జామ్​ను​ వాయిదా వేయాలని డిమాండ్​చేస్తూ ఓయూ నుంచి బహుజన విద్యార్థి సంఘాలు మంగళవారం ‘చలో టీఎస్​పీఎస్సీ’ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి టీఎస్​పీఎస్సీ ఆఫీస్​కు ర్యాలీగా బయల్దేరిన స్టూడెంట్స్​ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా బహుజన విద్యార్థి జేఏసీ చైర్మన్​ సంజయ్ మాట్లాడుతూ.. టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్​కు బాధ్యులైన బోర్డు చైర్మన్, సెక్రటరీ, సభ్యులను తొలగించాలని డిమాండ్​ చేశారు. ఆ తర్వాతే ఎగ్జామ్​ నిర్వహించాలన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు భరోసా ఇవ్వకుండా పరీక్ష నిర్వహిస్తే  సర్కారు కు బుద్ధి చెబుతామన్నారు.