జులైలో ఓయూ డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్

జులైలో ఓయూ డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో  వాయిదా పడ్డ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ను​ జులై మొదటివారంలో నిర్వహించాలని ఓయూ స్టాండింగ్​ కమిటీ  తీర్మానించింది. జూన్​ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్నందున జులై  మొదటి వారంలో డిగ్రీ, జులై 15 నుంచి  పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్​ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అప్పటికి  కేసులు తగ్గితేనే ఎగ్జామ్స్ పెట్టాలని లేకుంటే మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని  సభ్యులు సూచించారు. ఎగ్జామ్ హాల్  ను శానిటైజ్ చేసి.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా బెంచ్​కు ఒక స్టూడెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఎగ్జామ్ టైమ్ ను 3 నుంచి 2 గంటలకు కుదించినట్లు ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి ఆదివారం చెప్పారు. ఈ మేరకు క్వశ్చన్ పేపర్లలోనూ మార్పులు ఉంటాయన్నారు. బ్యాక్​లాగ్స్ ఉన్నవారిని డిటెండ్​ చేయకుండా ప్రమోట్​ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.  స్టాండింగ్​ కమిటీ తీర్మానాలను  ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి పంపుతామని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో  పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

పర్సనల్ వెహికల్స్ కు దేశమంతా ఒకే రోడ్ ట్యాక్స్