- ఓయూ వీసీ మొలుగారం కుమార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ మాత్రమే కాకుండా చదువుల అడ్డా కూడా అని, ఆ గుర్తింపును మరింత బలోపేతం చేయాలని వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థులు రూపొందించిన ‘ప్రజ్ఞ’ వార్షిక సంచికను ఆవిష్కరించారు.
చదువుతోపాటు సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ హాజరై ‘హ్యాండ్‌బుక్’ను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.స్వాతి, డీన్లు ప్రొఫెసర్ బి.లావణ్య, ప్రొఫెసర్ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
