ఆయిల్ పామ్‎తో రైతు నష్టపోడు.. నాలుగేండ్లు ఓపిక పడ్తే పంట చేతికొస్తది: మంత్రి వివేక్

ఆయిల్ పామ్‎తో రైతు నష్టపోడు.. నాలుగేండ్లు ఓపిక పడ్తే పంట చేతికొస్తది: మంత్రి వివేక్

హైదరాబాద్: ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతు నష్టపోడని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతుకు లాభదాయకమేనని.. కాకపోతే నాలుగేండ్లు ఓపిక పడ్తే పంట చేతికి వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఎక్కువ నీరు కూడా అవసరం లేదని చెప్పారు. శుక్రవారం (జులై 10) సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం జనగామ గ్రామంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ మెగా ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. పంటల మార్పిడిపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలినా రికార్డ్ పంట వచ్చిందని తెలిపారు. గతం కంటే 25 శాతం ఎక్కువ ప్రొక్యూర్ వచ్చిందని చెప్పారు. పంటలు కొనడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు.