సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ‘ఔషధి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్’ ప్రారంభం.. కూల్ వెదర్ లో సరుకుల రవాణా

సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ‘ఔషధి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్’ ప్రారంభం.. కూల్ వెదర్ లో సరుకుల రవాణా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీ, వెలుగు: ఫార్మా కంపెనీలకు సేవలు అందించేందుకు రూపొందించిన రిఫ్రిజిరేటెడ్ కాన్కోర్ కంటైనర్ ‘ఔషధి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్’ను సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్ కంటైనర్ డిపో నుంచి శనివారం దక్షిణ మధ్య రైల్వే రైల్వే జీఎం సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ శ్రీవాస్తవ జెండా ఊపి ప్రారంభించారు. ఔషధి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిచే ఈ రీఫర్ కంటైనర్ సేవను జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ పోర్ట్(జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీటీ) వరకు కాన్కోర్ సంస్థ నిర్వహిస్తోంది. 

ప్రాణరక్షక ఔషధాలు, తక్కువ టెంపరేచర్​లో ఉండే ఇతర సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి ఈ సేవను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రీఫర్ కంటైనర్లలో డీజిల్ పవర్ ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అమర్చడంతో ప్రయాణం కూల్​గా ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వేలు ప్రారంభిస్తున్న ఈ రీఫర్ రేక్ సేవలు ఎగుమతిదారులు, దేశీయ పంపిణీదారులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ సంజయ్ స్వరూప్, సికింద్రాబాద్ డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ఆర్.గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారులు, కాన్కోర్, మెర్స్క్ ప్రతినిధులు పాల్గొన్నారు.