తెలంగాణలో 33కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

తెలంగాణలో 33కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

33కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి  రోజు రోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 33కు చేరుకుంది. నిన్నటి వరకు 27గా ఉన్న కరోనా కేసుల సంఖ్య ఇవాళ 33కు చేరుకోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అలర్టైంది. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.

కరోనా వైరస్‌ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (OP) సేవలు అందుబాటులో ఉండవని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో OP సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రెగ్యులర్ చెకప్‌లు, అత్యవసరం కాని ఆపరేషన్లను నిలిపివేశారు. అవసరమైతే పారామెడికల్ సిబ్బందిని వినియోగించుకుంటామని తెలిపారు ఈటల.