కీసర, వెలుగు: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్‌కేసర్ నుంచి కీసర వైపు వస్తున్న కారు రాంపల్లి దయారా సమీపంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స కోసం తులసి హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు, గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
